20-01-2026 04:56:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో జూనియర్ కళాశాలలో ఈనెల 21 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. ప్రథమా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 21 22 23 24 తేదీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్ పక్షితో పాటు ఇతర పరీక్షలు ఉంటాయని తెలిపారు ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆయా కళాశాలలో ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్ లకు ఆదేశించినట్టు వివరించారు రాబోయే ఇంటర్ పరీక్షలకు మంచి ఫలితాలు సాధించే విధంగా ఇప్పటినుండి అన్ని కళాశాలలు దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు.