కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ
వార్డు అభివృద్ధిలో మరో మైలురాయి
ఆదర్శ వార్డుగా ఏడవ వార్డు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు కౌన్సిలర్ ఉట్ల వర ప్రదీప్ కు అభినందనల వెల్లువల పర్వం కొనసాగుతోంది. నిత్యం ఏడవ వార్డు అభివృద్ధి కోసం పరితపిస్తూ, తనదైన శైలిలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న శుభ సందర్భంగా, ఏడవ వార్డు ప్రజలు వరప్రదీప్ ను ఘనంగా సన్మానించి అభినందిస్తున్నారు. వార్డు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ముందున్న కౌన్సిలర్ వరప్రదీప్, త్రాగు నీటితో పాటు, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించి వార్డు ప్రజల మన్ననలనుపొందుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ఏడవ వార్డును, సుందరంగాతీర్చిదిద్దడంలోసఫలీకృతుడయ్యారు. ఈ,సందర్భంగా, కౌన్సిలర్ వరప్రదీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, అభివృద్ధి ప్రదాత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సహాయ సహకారాలతో, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ ప్రోత్సాహంతో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.






