కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ డ్రామా
- సీడబ్ల్యూసీ నివేదికతో తేటతెల్లం
- వెంటనే రైతులకు సాగునీరివ్వాలి
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి) : కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయని, సీడబ్ల్యూసీ నివేదికతో తేటతెల్లమైందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపులను ఆన్ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేకసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కన్నేపల్లి పంపులను ఆన్ చేసి ఉంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయ కసాగర్ రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉండేదన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పడంతో పాటు తక్షణమే కన్నేపల్లి పంపులను ప్రారంభించాలని జగదీశ్‌రెడ్డి డిమాం డ్ చేశారు. కృష్ణా జలాల విషయంలోనూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని విమర్శించారు.
వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ రాయలసీమలో నీటి వినియోగంపై ప్రభు త్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత ఉన్న ప్పటికీ ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయడం లేదన్నారు. ఎస్‌ఎల్బీసీ ఆయకట్టుకూడా నీరందక దేవరకొండ ప్రాంత రైతులు ధర్నాలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాగర్ నిండినా రైతులకు నీళ్లు ఇవ్వొద్దన్నట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టాయని విమర్శించారు.






