24 August, 2026 | 12:55 AM

కాంగ్రెస్‌లో చేరిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా

24-08-2026 12:21 AM

మైనంపల్లి హనుమంతరావు

మల్కాజిగిరి, ఆగస్ట్ 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయ వంతంగా అమలు జరుగుతున్న అ భివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న  ప్రతి ఒక్కరికి తగిన న్యా యం చేస్తానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హమీనిచ్చారు. మల్కాజిగిరి చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమ ంలో  పలువురు తెలంగాణ ఉద్యమ కారు లు, బీఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలు కా ంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాం గ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సాయినగర్ చౌరస్తా నుంచి నాయకులు, కార్య కర్తలు, మహిళా ప్రతినిధులు భారీ ర్యాలీగా మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో, బీఆర్‌ఎస్ నాయకులు టిఎన్ కృష్ణగౌడ్, జా గ్ మహేష్ గౌడ్, ఎల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, యో గేం దర్, ఆకుల శ్రీనివాస్, ఈశ్వర్ లతో పా టు పలువురు కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారి మెడలో మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అంతే కాకుండా సుమారు 2000 మంది ఆటో యూని యన్ డిసిఎం యూనియన్ సభ్యులు, బీఆర్ ఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ హిరంగ సభలో మైనంపల్లి హనుమంతరా వు మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో తనతో కలిసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు తెలుసు అన్నారు.

వచ్చే గ్రేట ర్ ఎన్నికల్లో గతంలో కంటే మరింత కష్టపడి పని చేసి మల్కాజిగిరిలోని 16 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థు లను గెలిపించేందుకు సమ ష్టిగా పని చేయాలన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగా ణ ఉద్యమకారులకు తగిన న్యాయం జరగలేదని ఆ యన విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందజేశామన్నారు. కొత్త వారికి పెన్షన్లు కూడా అం దించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడు తుందన్నారు.

ఉద్యమకారు లకు ఇం దిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు అం దించే విషయంపై సంబంధిత మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవలే తాను మా ట్లాడి, హామీ తీసుకున్నానని చెప్పారు. కాం గ్రెస్లో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భం గా మైనంపల్లికి హమీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి అబ్జర్వర్ సమీర్ కౌశల్, మాజీ కార్పొరేటర్లు వై. ప్రేమ్ కుమార్, జితేంద్ర నాథ్, మల్కాజిగిరి ఇంచార్జీ లక్ష్మీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బి బ్లాక్ అద్య క్షుడు వెంకటేష్ యాదవ్ బీకే శ్రీను, గుండా నిరంజన్, జిఎన్ వీ సతీష్ కుమార్ పిట్టల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్ వినోద్ యాదవ్ సత్య మూర్తి, యూసుఫ్ భాయ్, పిట్టల నాగరాజు,వైనాల ప్రవీణ్, రాందాస్ సంతోష్ ముదిరాజ్, రామచందర్, బాబు,సత్యనారాయణ,ఆశా, ఇందిర ప్రియదర్శిని, రోజా రమణి,ప్రభా, సుమ లత, పుష్పలత, ఆశ,శారద, కనక లక్ష్మీ, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.