calender_icon.png 12 November, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెబీ చైర్ పర్సన్ మౌనంపై కాంగ్రెస్ సర్క్యులర్ ఫైరింగ్

11-09-2024 11:38:17 AM

న్యూఢిల్లీ: సెబీ చైర్ పర్సన్ మాధవి పూరీ బుచ్ పై  అన్ని వర్గాల వారు రౌండప్ చేస్తున్నట్లు  కనిపిస్తోంది. కాంగ్రెస్ తాజా ఆరోపణలపై షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ స్పందించింది. మాధబిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన వారాలు గడుస్తున్నా ఆమె మౌనం వహిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు బుధవారం హిండెన్ బర్గ్ ఎక్స్ లో పోస్ట్ చేసి్ంది. మాధవికి 99 శాతం వాటాలున్న కన్సల్టింగ్ సంస్థ చాలా లిస్టెడ్ కంపెనీల నుంచి చెల్లింపులను స్వీకరించింది. ఈ కంపెనీలను సెబీ నియంత్రిస్తున్నట్లు న్ప విషయం తెలిసిందే . ఆమె సెబీ పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్న సమయంలో ఇది చోటు చేసుకొంది. ఆ కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీైసీ ఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ , పిడిలైట్ ఉన్నాయి. ప్రస్తుత ఆరోపణలు మొత్తం ఆమె భారతీయ కన్సల్టింగ్ కంపెనీపైనే వచ్చాయి. ఇంకా సింగపూర్ లోని సంస్థ వివరాలు వెలుగు చూడలేదు. అని పేర్కొంటున్నాయి. బుచ్ ప్రమోట్ చేసే స్ంస్థ రూ. 3 కోట్ల ఆదాయం సంపాదించిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పైనే వచ్చాయి. ఇంకా సింగపూర్ లోని సంస్థ వివరాలు వెలుగు చూడలేదు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి మాధవి భర్త దావల్ 4.78 కోట్ల మేర ఆదాయం పొందారని కాంగ్రెస్ తెలిపింది. మాధవి సెబీ బోర్డ్ లో పూర్తి స్థాయి సభ్యురాలిగా ఉన్న సమయంలోనే ఆమె భర్త ఈ ఆదాయాన్ని అందుకున్నారు అని ఆరోపించింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఈ ఆరోపణలు చేశారు. మరోవైపు మహీంద్రా మాత్రం వీటిని ఖండించింది. ఈ ఆరోపణలు తప్పుదారి పట్టించేలా ప్రజలకు అవాస్తవాలు తెలియజేస్తున్నారని పేర్కొంది. ఇక ఆమె భర్త ఎప్పటినించో తమతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించింది.