calender_icon.png 9 February, 2026 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్డి పేట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్

09-02-2026 07:23:16 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఎస్ఎస్కె కేంద్రం జిజిహెచ్ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ నాగులపల్లి రాజేందర్  హాజరై గ్రామస్తులు అందర్నీ కూడా వైద్య సేవల గురించి వివరించి జరిగింది. డాక్టర్ స్నేహ అందరికీ HIV/HBS ag, HCV, RBS, MP, DENGUE, SYPHYLIS, 1097, CHEST X-RAY, సేవల గురించి వివరించి అవసరమైన వారికి పరీక్షలు చేయడం జరిగింది.

దీనిలో భాగంగా సుమారుగా గ్రామంలో ఎక్స్ రే లు 70 మందికి రక్త పరీక్షలు 164 మందికి నిర్వహించి వారికి రిపోర్టులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రెడ్డి పేట, రామారెడ్డి మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ సురేష్, ART సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ గార్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వీరందరూ గ్రామంలోని ప్రజలకు వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని పైన తెలిపిన టెస్టులని వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి తరఫున DPM సురేందర్ రెడ్డి, CSO, నవీన్ కుమార్, NACP కౌన్సిలర్ నాగరాజు, శేఖర్, మెహరాజ్,YRG ORW లు కృష్ణమూర్తి, శ్వేత,MPHA లు భువనేశ్వరి, రాణి, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్, X-RAY టెక్నీషియన్లు దత్తాద్రి, సరోజ, STS శ్యాం కుమార్ VDC అధ్యక్షులు లక్కాకుల నరసింహులు, వార్డు సభ్యులు అశ్వక్, ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.