calender_icon.png 9 February, 2026 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచ్చిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

09-02-2026 07:45:14 PM

తాండూరు కిచన్నపేట గ్రామంలో త్రిలింగేశ్వర్

ఆలయంలో ప్రత్యేక పూజలు

చిన్న ఆత్మకూరు చిన్నారులకు సేవా కార్యక్రమాలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామంలో సోమవారం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి–పవిత్ర దంపతుల ముద్దుల కుమారుడు సచ్చిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా పండువగా నిర్వహించారు. 29 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి త్రిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అర్చకులచే అభిషేకం చేయించి దైవ ఆశీస్సులు పొందారు.అనంతరం చిన్న ఆత్మకూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు,విద్యార్థుల మధ్య సచ్చిత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు కుర్చీలు,విద్యార్థులకు భోజనం ప్లేట్లు, షూలను పంపిణీ చేశారు. సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమం చిన్న ఆత్మకూర్ గ్రామంలో అందరి మనసులను ఆకట్టుకుంది.

సచ్చిత్ రెడ్డిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు ఆశీర్వదించి మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత లచ్చయ్య, ఉపాధ్యాయులు కల్యాణి, రాజ్యలక్ష్మి, సురేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సంగయ్య, వార్డు సభ్యులు, నాయకులు విజయ్ కుమార్, పిరారెడ్డి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.