calender_icon.png 9 February, 2026 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ కి దమ్ముంటే ఇళ్ళు కట్టించి చూపించు... వజ్రేష్ యాదవ్

09-02-2026 07:03:29 PM

శామీర్ పేట్,(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇచ్చినా హామీలను నిరవేరుస్తామని ప్రభుత్వ చీప్ వీప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం అలియబాద్ మున్సిపాలిటీ మాలక్ పేట్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి , డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ లు మాట్లాడుతూ.... మేడ్చల్ నియోజక వర్గా ప్రజల కోసం  ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టామన్నారు.

ప్రతి ఒకగ్రామనికి 80శాతం ఉచిత కరెంట్ ఇస్తున్నం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ కు విజయం చేకూరుస్తుందన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి 10 సవత్సరాలు అధికారంలో ఉండి కూడా నియోజకవర్గన్నీ ఎం అభివృద్ధి చేయలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కి దమ్ముంటే తన సొంత నిధులతో 50 ఇళ్ళు కట్టి చూపించాలని ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్  వి అన్ని బోకర్ మాటలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. రాష్టంలో  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత కరెంట్ , ఉచిత బస్ , ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఇనియర్ నాయకుడు మున్సిపలిటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తునికి రమేష్  నక్కప్రభాకర్ గౌడ్ , అలియబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి కంఠం శిరీష కృష్ణ రెడ్డి , నాయకులు తదితరులు పాల్గొన్నారు.