calender_icon.png 9 February, 2026 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థినిలు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలి

09-02-2026 07:55:04 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన విద్యార్థినులు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... 2026- 27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో గిరిజన విద్యార్థినులు ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్యలో భాగంగా డిగ్రీ ప్రవేశాల కొరకు సకాలంలో దరఖాస్తు చేసుకొని అడ్మిషన్లు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి.శారద, వైస్ ప్రిన్సిపల్, ఐ.క్యు.ఎ.సి. సమన్వయకర్త అరుణ తదితరులు పాల్గొన్నారు.