11-09-2024 11:09:55 AM
హైదరాబాద్: గచ్చిబౌలి రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గేస్ట్ హౌస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నిర్వహించిన రేవ్ పార్టీలో నిందితుల నుంచి గంజాయి, ఈ- సిగరేట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. 18 మంది యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో ప్రభుత్వ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, సినీరంగ వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.