24-02-2026 01:03:42 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలన్న మాటను కాంగ్రె స్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, కేవలం 17.08 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పెద్దతూప్రా మాజీ సర్పంచ్ చిటికెల వెంకటయ్య వంశరాజ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాటతప్పిందని, స్థానిక సంస్థల్లో వెన్నుపో టు పొడిచిందన్నారు.
రాజకీయ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం లో ఆర్టికల్ 243-డీ(6) మరియు 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారముం ది. ఈ అధికారం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ స ర్కారు బీసీలకు సముచిత రిజర్వేషన్లు ఇవ్వకపోవడం చాలా విచారకరం అని చిటికెల వెంకటయ్య వంశరాజ్ పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదన్న నిబంధన ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా శాతం, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని హామీ ఇచ్చింది.
కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హా మీని పూర్తిగా విస్మరించింది అని తెలిపారు. రూ.160 కోట్లతో కుల గణన పేరుతో సర్వేలు, నివేదికలు, జీవోలు అన్నీ సృష్టించి చివరికి వెన్నుపోటు పొడిచినట్లుగా 42% రిజర్వేషన్ల మాట మరిచి పోయారు అని వెంకటయ్య వంశరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బీసీలకు కేవలం 17.08 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి, బీసీల ప్రాతినిధ్యాన్ని పూర్తిగా తగ్గించిందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 మండలాల్లో కనీసం ఒక గ్రామ పంచాయతీకి కూడా బీసీ కోటా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమం మళ్లీ జ్వాలలెత్తుతుంది అని చిటికెల వెంకటయ్య వంశరాజ్ హెచ్చరించారు.