24-02-2026 01:03:49 AM
ప్రోటోకాల్ పాటించని అధికారులు
ప్రభుత్వ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ సర్పంచులకు ఆహ్వానం కరువు
దిక్కుతోచని స్థితిలో సర్పంచులు
ప్రభుత్వ పథకాలు వివరించని కాంగ్రెస్ నాయకులు
జుక్కల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బిఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము సర్పంచులుగా గెలిచినప్పటికీ ఏ కార్యక్రమంలో కూడా అధికారులు సమాచారం ఇవ్వడం లేదంటూ వాపుతున్నారు. రాము సర్పంచులు గా ఉన్న లేనట్లేనని మదన పడుతున్నారు. గ్రామాల్లో జరిగే సిసి రోడ్ల పనులు, ఇందిరమ్మ ఇండ్ల పనులకు తమకు పిలవకుండానే కాంగ్రెస్ నాయకులు గ్రామ కార్యదర్శులు కలిసి ప్రారంభోత్సవాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
జుక్కల్ మండలంలోని డోన్గామ్, గుండూర్, పెద్ద ఏడ్గి, పడంపల్లి, కౌలాస్ ఈ విధంగా కొన్ని గ్రామాల్లో సర్పంచులకు ఆహ్వానం కరువైందని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ లాంటివి కూడా కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులతోనే పనులన్నీ కానిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఈ విధంగా ప్రజాస్వామ్యంలో సర్పంచులు పాత్ర ఎక్కడి వరకు న్యాయంగా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. తమపై కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచులుగా తమకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా మని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇతర పార్టీలకు చెందిన సర్పంచులకు కూడా ఈ విధంగా పక్షపాత ధోరణి వహించలేదని చెబుతున్నారు.
కనీసం అధికారులకు కూడా ప్రోటోకాల్ పాటించాలని సోయి లేకుండా పోయిందని విమర్శి స్తున్నారు. గ్రామ కార్యదర్శులు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వత్తిడులకు తలొగ్గి వారికే వత్తాసు పలుకుతున్నారని అంటున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోవాలో కూడా తమకు అంత పుట్టడం లేదని అంటున్నారు. ఇంత పక్షపాతం పనికిరాదని తమకు కూడా సర్పంచుల హక్కులు విధులు నిర్వహించుకునే విధంగా అధికారులు చూ డాల్సిన బాధ్యత ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము చేయా ల్సిన పని చేస్తామని పేర్కొంటున్నారు.