08-01-2026 01:18:45 AM
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యా లు ఉన్న పార్టీలని, పిల్లి, ఎలుకలు అయినా కలిసి వుంటాయేమో కానీ కాంగ్రెస్, బీజేపీ కలవవని, కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రిలేషన్‌లో ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోమాట్లాడారు. పని గట్టుకుని బీఆర్‌ఎస్‌పై విష ప్రచారం చేస్తున్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.