తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
చెన్నై: తమిళనాడు గవర్నర్(Tamil Nadu Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ భారీ షాక్ తగలనుంది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు TVK అధినేత విజయ్‌ను ఆహ్వానించడానికి నిరాకరించినందుకు గాను, BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌లకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీ (TNCC) నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది.
ఒక ప్రకటనలో, TNCC అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై మాట్లాడుతూ.... తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు TVKకి ఉన్న న్యాయబద్ధమైన అవకాశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిరాకరించేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నారని తెలిపారు. నరేంద్రమోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. శుక్రవారం ఉదయం తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, పదాధికారులందరూ పాల్గొంటారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.






