calender_icon.png 8 December, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామడ మండలంలో కాంగ్రెస్ ప్రచారం

08-12-2025 06:09:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): మామడ మండలం వెంకటాపూర్, నల్లుర్తి గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పడాల శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు సోమవారం ఉదయం విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడి, స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీహరి రావు, గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీనే భరోసా అని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.