4 March, 2026 | 11:30 AM

కంటైనర్ లో గోవుల తరలింపు

04-03-2026 09:59 AM

వెంబడించి పట్టించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు 

కంటైనర్ ను వదిలి పారిపోయిన డ్రైవర్ 

గోశాలకు ఆవుల తరలింపు 

అడ్డాకుల :  కంటైనర్ లో అక్రమంగా గోవులను తరలిస్తుండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు 112 కాల్ చేయడంతో  సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై  సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డాకుల టోల్ ప్లాజా మంగళవారం సాయంత్రం  కంటైనర్ ను పట్టుకుని అడ్డాకుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి కె.ఏ 01 ఏ.ఎం 1978 నెంబర్ గల పెద్ద కంటైనర్ లో  అక్రమంగా గోవులను తరలిస్తున్నారని షాద్నగర్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కంటైనర్ ఆపకపోవడంతో  కారులో వెంబడించి అడ్డాకుల టోల్ ప్లాజా దగ్గర కంటైనర్ ను ఆపారు. డ్రైవర్ బజరంగదళ్ కార్యకర్తలను చూసి భయపడి కంటైనర్ దిగి పారిపోయాడు. కొంతమంది బజరంగ్ దళ్   కార్యకర్తలు కంటైనర్ నడుపుకుంటూ అడ్డాకుల పోలీస్ స్టేషన్కు తరలించారు. కంటైనర్ ను, అందులోని34 ఎద్దులు జడ్చర్ల సమీపంలో ఉన్న గోశాలకు తరలించారు.