07-12-2025 03:57:01 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీతండా(డీ) గ్రామ శివారులో ఆదివారం గుడుంబా స్థావరాలపై దేవాపూర్ పోలీసులు దాడులు చేశారు. దేవాపూర్ ఎస్ఐ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీతండా గ్రామ శివారులో గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తున్నారని, సమాచారం మేరకు పోలీసులు వెళ్లి ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ తనిఖీల్లో లభ్యమైన 1000 లీటర్ల బెల్లం పానకంతో పాటు సామాగ్రిని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్ఐ గంగారాం హెచ్చరించారు. గుడుంబా నియంత్రణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గుడుంబా నిర్మూలన కోసం అందరూ సహకారం చేయాలని, గ్రామంపై నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో సింబ్బంది పాల్గొన్నారు.