17 April, 2026 | 3:45 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

కవిత మాటలు కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదు

31-05-2025 02:57 AM

ప్రభుత్వ సలహాదారు కేశవరావు 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌లో చేరితే లాభం ఉందనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కవిత వల్ల పార్టీకి పెద్దగా లాభం కలిసి వస్తుందని అనుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కేశవరావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో మాట్లాడుతూ.. కవిత మాటలను కాంగ్రెస్‌లో ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు.

తెలంగాణ ఇవ్వనందుకే తాను గతంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. మావోయిస్టులు చర్చకు వస్తానంటే.. కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగే ఆపరేషన్స్ గురించి పార్లమెంట్‌లో మాట్లాడానని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో సీఎం రేవంత్ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.

భారత్ మధ్య ఆరు యుద్ధాలు జరిగాయని, మిలటరీ చేసే పనులకు రాజకీయ జోక్యం ఎందుకని ప్రశ్నించారు. యుద్దంలో గెలుస్తామని, పాక్‌కు బుద్ది చెప్పబోతున్నామన్న తరుణంలో..ఎవరో ట్రంప్ మాటలకు కాల్పుల విరమణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.