11 March, 2026 | 10:26 PM

పట్టణాల్లో పరిశుభ్రంగా.. సమర్థవంతంగా ప్రజా పాలన అమలు

11-03-2026 06:50 PM

* జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్

అచ్చంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పట్టణాల్లో పరిశుభ్రంగా సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ సూచించారు. బుధవారం అచ్చంపేటలో చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాల్లో మరింత పరిశుభ్రంగా, సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు, సిబ్బందికు సూచించారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

ప్రధానంగా పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. 13వ వార్డు పరిధిలోని వలపట్ల కాలనీలో ప్రజలకి సౌకర్యం కల్పించే విధంగా ఉంచాలన్నారు. కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల్లో పారిశుద్ధ్య పట్ల అవగాహన పెంపొందించడమే కాకుండా, పట్టణ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా, సురక్షితంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి, ఏఈ రాజా నాయక్, సానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్, కౌన్సిలర్లు అంతటి శివ శ్రీనివాసులు గడ్డం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.