11 March, 2026 | 8:05 PM

పనిచేసే నేతలకు పార్టీ గుర్తింపు

11-03-2026 06:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పనిచేసే ప్రతి నాయకునికి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఇస్తుందని పార్టీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తితో పాటు నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపల్ లో ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే బుజ్జి వెడుమ బొజ్జు పటేలమాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షులు శ్రీరరావు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మన్ అలీ, నాయకులు కృష్ణవేణి భీమ్ రెడ్డి రాజేశ్వర్ నాందేడ్ చిన్ను సమరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.