30 March, 2026 | 2:17 AM

నిరుపేదల ఇంటి పార్టీ కాంగ్రెస్

04-05-2024 12:05 AM

మహిళా సంఘాలకు భవనాలు లేకుంటే నాకే అవమానం 

ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, మే ౩ (విజయక్రాంతి) : నిరుపేదల ఇంటి పార్టీ కాంగ్రెస్ అని, ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని  మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం మహబూ బ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని షేక్‌పల్లి, ఎల్లంబాయితాండ, బోయపల్లి గ్రామా ల్లో యెన్నెం ప్రచారం నిర్వహించారు. మహిళ సంఘాలకు భవనాలు లేకుం టే తనకే అవమానకరం అన్నారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధి జరుగలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో కాంగ్రెస్ సర్కారు మంచి అడుగులు వేస్తున్నదని చెప్పారు. తక్కువ సమయంలోనే ఎక్కువ పథకాలను ప్రజల ధరిచేర్చామని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పలవురు బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్‌ముదిరాజ్, లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.