30 March, 2026 | 3:48 AM

నేటి నుంచి కేసీఆర్ యాత్ర కంటిన్యూ

03-05-2024 02:09 AM

రామగుండంలో సాయంత్రం 8 గంటలకు రోడ్ షో

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర శుక్రవారం నుంచి యథావిధిగా కొనసాగనుంది. కేసీఆర్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేదం విధించగా.. నేటి రాత్రి 8 గంటలతో గడువు ముగియనుంది. దీంతో శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత పెద్దపెల్లి జిల్లా రామగుండం నుంచి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ రెండ్రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణ యం తీసుకుంది. నిషేధం అమలు ఉన్న సమయంలో బహిరంగ సభ లు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లావద్దని ఈసీ సూచించింది.

షెడ్యూల్ ప్రకారం బుధవారం మహబూబాబాద్ రోడ్ షో నిర్వహించి వరంగల్‌లో బస చేయాల్సి ఉంది. వరంగల్ నుంచి గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్ షో నిర్వహిం చి వీణవంకలో బస చేయాల్సి ఉంది. రామగుండం నుంచి యాత్ర తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యం లో భారీగా జనాలను తరలించేందుకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టేలా రోడ్‌షోలు నిర్వహిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు వెల్లడించారు.  

బస్సుయాత్ర, రోడ్‌షో వివరాలు 

మే 3న సాయంత్రం 8 గంటల తరువాత రామగుండంలో రోడ్ షో

మే 4న సాయంత్రం 

మంచిర్యాలలో రోడ్ షో

మే 5న సాయంత్రం జగిత్యాల 

మే 6న నిజామాబాద్ రోడ్ షో

మే 7న కామారెడ్డి రోడ్ షో

మే 8న నర్సాపూర్, అనంతరం పటాన్‌చెరు రోడ్ షో

మే 9న కరీంనగర్ రోడ్ షో

మే 10న సిరిసిల్ల రోడ్ షో 

అనంతరం సిద్దిపేటలో బహిరం గ సభతో బస్సుయాత్ర ముగింపు