calender_icon.png 5 February, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచార హోరు.. బీఆర్‌ఎస్ జోరు

05-02-2026 01:08:08 AM

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం

మెదక్ ఫిబ్రవరి 4(విజయక్రాంతి): గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ కాన్సిలర్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లా లోని నాలుగు మున్సిపాలిటీలోనీ ఆయా వార్డు ల్లో డప్పుచప్పుళ్లతో అభ్యర్థులకు ఘన స్వాగతం లభిస్తున్నది. బోనాలు, బతుకమ్మలతో మహిళలు నీరాజనం పడుతుండగా, ర్యాలీలు వేలాదిగా తరలివస్తున్న మహిళలు, యువతీయువకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదనిగడపగడపకూ వెళ్లి అభ్యర్థులు ప్రజలకు విన్నవిస్తున్నారు. గులాబీ పార్టీకి జైకొడుతున్న సబ్బండ వర్ణాలు గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం : బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి 

మెదక్ మున్సిపాలిటీ లో బిఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది. బుధవారం మెద క్ మున్సిపల్ పరిధిలోని 1,2,3,4, వార్డుల్లో ఇంటింటి ఎన్నికల నిర్వహించారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు ప ద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎరువులు సకాలంలో అందజేస్తూ ఇబ్బందులు లేకుండా చూసారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు బారులు తిరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి, ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు.

ఎమ్మెల్యే సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, అనాధలను ఆదుకుంటున్నామని ప్రచారం చేశారని , అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఎవరిని ఆదుకున్నారని ప్ర శ్నించారు. కేసులు పెడతామని భయభ్రాంతులకు కూడా చేస్తే ఇక్కడ భయపడే వారు ఎవరు లేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి,మాజీ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,భీమారి. కిషోర్,వార్డ్ ఇంచార్జిలు హవేళిఘనాపూర్ సర్పంచ్ మ్యాకల సాయిలు, ఉప సర్పంచ్ వడ్ల రాజు, వార్డు ఇంచార్జ్లుసుదర్శన్, రవీందర్, మోహన్ నాయక్, నాగరా జు, రామచంద్ర రెడ్డి శ్రీహరి, పట్టణ నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు .