17 August, 2026 | 6:56 PM

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర

17-08-2026 06:26 PM

మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు బోడుప్పల్ ,పీర్జాదిగూడ బి ఆర్ ఎస్ నేతల నిరసన

రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మంద సంజీవరెడ్డి డిమాండ్

మేడిపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వo పెళ్లి కానుకగా, కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ల పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఆపేసే కుట్ర జరుగుతుందని ఆ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు బోడుప్పల్, పీర్జాదిగూడ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సోమవారం బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు , మహిళలు పాల్గొని కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ పేద ఇంటి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా 1లక్ష 16 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కెసిఆర్ నాయకత్వంలో విజయవంతంగా అమలు చేశామని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఎన్నికల్లో1 లక్ష 16 వేల రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి నేడు కళ్యాణ లక్ష్మి పథకం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని పాండిపడ్డారు.

ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు వినిపించకుండా తాత్సారం చేస్తూ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలను, ప్రజలను, మోసం చేస్తుందని, ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలు  తగిన బుద్ధి చెప్తారని, తక్షణమే ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు,  అన్ని పథకాలు అమలు చేసి తీరాలని మంద సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, ఫిర్జాదిగూడ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘు వర్ధన్ రెడ్డి, బోడుప్పల్, పీర్జాదిగూడ మాజీ కార్పొరేటర్లు, బి ఆర్ ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.