21 July, 2026 | 11:21 AM

ఎస్‌ఐఆర్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

21-07-2026 12:00 AM

బీఅర్‌ఎస్‌నేత ప్రేమ్‌గౌడ్

రాజేంద్రనగర్, జూలై 20 (విజయక్రాంతి): ఎస్‌ఐ ఆర్ కార్యక్రమం లో కాంగ్రెస్ ప్రభు త్వం ఘోరంగా వి ఫలమైందని బండ్లగూడ జాగీర్ బిఆర్‌ఎస్ నాయకులు ప్రేమ్ గౌడ్ ఆరోపించారు. రాజేంద్ర నగర్ నియోజవర్గంలో ప్రభుత్వం ఎస్‌ఐఆర్ కార్యక్రమం కోసం నియమించిన అధికారులు ఎవరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. మీకున్న కాస్త సమయాన్ని కేటాయించి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడే ఇండ్లు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా రాజేంద్రనగర్ ని యోజకవర్గం బండ్లగూడ జాగిర్‌లోనీ ఓటర్ లిస్ట్‌లో తమ కుటుంబ సభ్యుల పేర్లు ఉండే విధంగా చూసుకోవాలని రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని బి అర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజేంద్రనగర్ ని యోజకవర్గాన్ని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుం దామని ఆయన ఓటర్లకు  పిలుపునిచ్చారు.