లిఫ్ట్‌లో ఇరుక్కున్న తల్లి కొడుకులను కాపాడిన పోలీసులు
21-07-2026 12:00 AM
కూకట్‌పల్లి, జూలై 20 ( విజయక్రాంతి ): ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో తల్లి కొడుకులు లిఫ్ట్‌లో ఇరుక్కున్న సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి 9వ ఫేస్‌లో సోమవారం జరిగింది. 9వ ఫేస్‌లోని కోటక్ మహీంద్రా భవనంలోని లిఫ్ట్‌లో ఓ మహిళ తన కొడుకుతో సహా ఇరుక్కుపోయింది. మహిళ వెంటనే 100 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని రాడ్ లు, కర్రలతో లిఫ్ట్ డోర్ తెరిపించి మహిళను, ఆమె కుమారుడిని కాపాడారు. సకాలంలో స్పందించి తల్లి బిడ్డను కాపాడినందుకు పోలీసులకు స్థానికులు ధన్యవాదములు తెలిపారు.






