05-08-2025 12:40:39 AM
ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి
కంగ్టి, ఆగస్టు 4: బీఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా కాలయాపన చేసిన పనిని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం కంగ్టి మండలంలో బసవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల కొరకు కృషి చేస్తున్నామని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నారాయణాఖేడ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక నాపై బురుద జల్లుతున్నారని అన్నారు.
పక్కనే ఉన్న జుకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి కౌలాస్ నాలా ప్రాజెక్టు నుండి కంగ్టి మండలానికి నీరు అందించేలా కృషి చేస్తున్నానని అన్నారు. మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని కోటీశ్వరులను చేయడానికి సీఎం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్, ఎంపీడిఓ శ్రీనివాసులు, ఎంపిఓ సుభాష్, నాయకులు మనోజ్ పాటిల్, పరశురాం, నాగ్ నాథ్, దారం వెంకన్న, కళ్యాణ్ రావ్ పాటిల్, వినోద్ పాటిల్, పండరినాథ్ రావ్, శంకర్, లక్ష్మణ్, లొండే నర్సింలు తదితరులు పాల్గొన్నారు.