05-08-2025 12:42:23 AM
ల్యాబ్ వ్యాన్ ప్రారంభించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం, ఆగస్ట్ 4 (విజయ క్రాంతి): నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగపడే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ప్రారంభించారు. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి తక్షణమే పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ వాహనం పూర్తి సదుపాయాలతో కూడిన మొబైల్ ల్యాబ్ గా పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ అన్నారు.
నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి, ఆయా ప్రదేశంలో లభించిన అన్ని రకాల సాక్ష్యాలను (ఫింగర్ప్రింట్స్, రక్తపు నమూనాలు, ఇతర ఆధారాలు) సేకరించి, ప్రాథమిక విశ్లేషణలు చేసే ఈ వాహనం నేర పరిశోధనలో చాలా ముఖ్యమైనదని అన్నారు.కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, డాక్టర్ వి. నాగలక్ష్మి (శాస్త్రీయ అధికారి) కె. సుధాకర్ (శాస్త్రీయ అధికారి)కె. నరసింహ (అసిస్టెంట్ డైరెక్టర్)ఆర్ ఐ కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగులుమీరా,పాల్గొన్నారు.