17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రైతు నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

29-05-2025 02:16 AM

బీఆర్‌ఎస్ రామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం 

కామారెడ్డి, మే 28,(విజయ క్రాంతి): రైతు రాజ్యం అని చెప్పి రైతులను నడ్డి ఏడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అని  టిఆర్‌ఎస్ పార్టీ రామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడగల శ్రీనివాస్ తో కలిసి మాట్లాడటం జరిగింది. రామారెడ్డి మండలంలో 17వేల ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతుంది.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రామారెడ్డి మండలానికి రెండు వందల బ్యాగులను జిగురు విత్తనాలను ఇవ్వడం జరిగింది. 200 బ్యాగులు 500 ఎకరాలకు కూడా సరిపోవడం జరగదు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 30 కిలాల బ్యాగును 840కి ఇస్తే రైతుల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోల జిలుగు బ్యాగును 2140 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వాన్ని కంటే రెండు రెట్లు పెంచి రైతులు నడ్డి విరచడం జరుగుతుంది.

ఇప్పటివరకు వరి ధాన్యానికి బోనస్ కూడా చెల్లించడం జరగలేదు. మా రామారెడ్డి మండల కేంద్రంలో సుమారు బోనస్ రూపంలో రావాల్సిన డబ్బు ఒక కోటి 50 లక్షలు వరకు రైతులకు జమ చేయవలసి నా రూపాయలను ఇంతవరకు జమ చేయడం జరగలేదు. పూర్తిగా రుణమాఫీ కూడా చేయడం జరగలేదు. ఎకరానికి 15000 చెప్పి రూ.12,000 ను అది కూడా అందరి రైతులకు ఇవ్వకుండా రైతు భరోసాను కాలయాపన చేయడం జరుగుతుంది.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అని రాబోయే రోజులలో రైతులతో గెలిచిన మీ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం తప్పక చెప్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగారం,రాజు, మాజీ ఎంపీటీసీ రాజేందర్, మాజీ ఉపసర్పంచ్ పోతులూరి ప్రసాద్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మైపాల్, మాజీ టిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు సుధాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.