calender_icon.png 30 July, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: ఓడితల ప్రణవ్

29-07-2025 04:51:49 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు(Congress Party In-charge Vodithala Pranav) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులు మంగళవారం పంపిణీ  చేసారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ.. 5 మండలాలు, 2 పట్టణాల్లోని 147 మంది లబ్ధిదారులకు రూ.51,14,000 విలువైన చెక్కులు అందజేశామన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. చెక్కులు పొందిన లబ్ధిదారులు వెంటనే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు.

చెక్కుల పంపిణీలో ఆలస్యం చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోవాలఅన్నారు. ‘ప్రోటోకాల్ పేరుతో సీఎం ఫోటో కట్ చేసి చెక్కులు ఇవ్వడమేనంటారా..?అని ప్రశ్నించారు.ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం సంక్షేమ పథకాల రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని, ఈ పథకాలే రాబోయే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసేలా చేస్తున్నాయని ప్రణవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మార్కెట్ చైర్మెన్లు, డైరెక్టర్లు, దేవస్థాన చైర్మెన్లు, పార్టీ సీనియర్ నేతలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.