29-07-2025 04:54:41 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి..
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిజాన్ని అంతం చేయలేరని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao), సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా 4వ మహాసభ వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు, కార్మికులు కలిగిన పెద్ద పార్టీ కమ్యూనిస్టు అని ప్రపంచంలో ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బిజెపి లాంటి ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు పరిమిత మైతారని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకుందని, పేదల పక్షాన నిలబడేది ఎర్ర జెండా పార్టీ అని ఆయన కొనియాడారు. గత పదేళ్లు రాష్ట్రంలో నియంతృత పోకడ అవలంబించిన కేసీఆర్ ను గద్దె ఎక్కనివ్వకుండా ఓడించడంలో సిపిఐ ప్రధాన భూమిక పోషించిందన్నారు. ఆగస్టు మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థులు అధిక స్థానంలో గెలుపొందాలని ప్రస్తుతం నడుస్తున్న పొత్తు ధర్మాన్ని పాటించడంతోపాటు స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. డిసెంబర్ 26న ఖమ్మం జిల్లాలో జరిగే సిపిఐ 100 వసంతాల జాతీయ స్థాయి ముగింపు బహిరంగ సభకు దేశం నలుమూల నుండి లక్షలాదిమంది తరలివస్తున్నారని అన్నారు.
ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాముల, బోడ సుదర్శన్, బండి జంగమ్మ, చేడే చంద్రయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు యానాల దామోదర్ రెడ్డి, బోలోగాని సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కొల్లూరి రాజయ్య, ఎండీ ఇమ్రాన్, బచ్చనగోని గాలయ్య, ఉప్పల ముత్యాలు, చెక్క వెంకటేష్, కుసుమని హరిచంద్ర, ఏశాల అశోక్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశికంటి లక్ష్మీ నరసయ్య, స్వాతంత్ర సమరయోధులు బత్తిని యాదగిరి, వలిగొండ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి, సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎలగందుల అంజయ్య, పోలేపాక యాదయ్య, నాయకులు పులిపలుపుల మల్లేష్, పట్టణ కార్యదర్శి సల్వార్ధి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.