calender_icon.png 30 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

29-07-2025 04:49:23 PM

జిల్లా అధికారి సలియానాయక్..

నిర్మల్ (విజయక్రాంతి): వినియోగదారుల హెచ్ టి 11 KV, 33 KV ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సలియానాయక్(Circle Superintending Engineer Saliyanayak) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... హెచ్ టి 11 KV, 33 KV, ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 11 KV వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏడిఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని, అలాగే 33 KV వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి.ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు. 

ఈ సింగిల్  విండో  కొత్త విధానం వలన మొదట వినియోగదారులు  TGNPDCL పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో  HT దరఖాస్తులు( టీజీ  ఐపాస్ లో నమోదు కానటువంటివి)  నమోదు చేసుకున్న తర్వాత కొత్త  అప్లికేషన్ నంబర్ (UID) ఉత్పన్నమవుతుంది. అలా  వచ్చిన కొత్త దరఖాస్తులు  TGNPDCL యొక్క సంబంధిత సర్కిల్‌లలో డాష్ బోర్డులో కనిపిస్తుంది. ప్రతిరోజూ  ADE/కమర్షియల్‌ అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తూ ఉంటారు. దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11KV, 33 KV ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని, ADE/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారు. 33 KV మరియు ఆ పై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారు. 

ఇక  33KV ఆ పై వోల్టేజి  దరఖాస్తులు  అయితే, ఆన్‌లైన్‌లో సంబంధిత CE/కమర్షియల్ & RAC/TGTRANSCO హైదరాబాద్  కి  ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుంది. 11KV వోల్టేజి  దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె  రెండు రోజుల్లో  అప్‌లోడ్ చేయబడుతుంది. వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు  ఆ సూచనలు వినియోగదారునికి SMS రూపేణా పంపబడుతుంది. అలాగే 33 KV, ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు  పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సింగిల్  విండో వ్యవస్థ వలన త్వరితగతిన సర్వీసులు మంజూరు అవుతాయని, ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు. దీనివలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు SMS రూపేణా సమాచారం పంపబడుతుందని వివరించారు.