2 July, 2026 | 1:01 PM

Breaking News

దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యం

16-06-2025 01:21 AM

ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ టౌన్, జూన్ 15 : దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఎం లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని పెద్ద బండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ లో రెండు రోజులపాటు జరుగుతున్న సీపీఎం నల్లగొండ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు అమ్ముతూ సార్వభౌమత్వాన్ని పేదలకు కూలి, భూమి అందే వరకు, దోపిడీ అంతం అయ్యేవరకు ఎర్రజెండా ప్రజల్లో గుండెల్లో ఉంటుందని అన్నారు.