17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పేదలకు సన్న బియ్యం అందించడమే లక్ష ్యం

02-04-2025 12:07 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ  ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున  హన్మకొండ 5వ డివిజన్ రెడ్డి కాలని, 57వ డివిజన్ గోకుల్ నగర్, 62వ డివిజన్ కాజిపేట్ సోమిడి,63వ డివిజన్ లలో సన్న బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణి చేసారు.ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్యపు రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెదలందరూ తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం అందుబాటులోకి తెచ్చారు. ఉచిత సన్న బియ్యం పంపిణి కోసం ప్రభుత్వం కిలోకు రూ.40 వరకు ఖర్చు చేసింది. ధనవంతులు తినే సన్న బియ్యం ఇక పై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ లాంచనంగా ప్రారంభించడం జరిగింది.దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డ్ దారులకు ఉచితంగా సన్న బియ్యం కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తాము తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచిస్తుందని, అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, జక్కుల శ్రీనివాస్ యాదవ్,విజయ శ్రీ రజాలి, నల్ల స్వరూప రాణి, కాజీపేట తహసిల్దారు బావ్ సింగ్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అద్యక్షుడు బత్తుల రమేష్ , బంక సంపత్ యాదవ్,అనిత  తదితరలు పాల్గొన్నారు.