17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇది పేదల ప్రభుత్వం

02-04-2025 12:08 AM

సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి క్షీరాభిషేకం చేసిన సన్నబియ్యం లబ్ధిదారులు 

గజ్వేల్, ఏప్రిల్ 1: పేదల సంక్షేమానికి కృషి చేసే  కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వమని ఆర్ అండ్ ఆర్ కాలనీ  సింగారం గ్రామ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి రాములు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా  పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంగళవారం లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎక్కడా లేనివిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 ల గ్యాస్ సబ్సిడీ అమలు చేశారన్నారు.

రైతులకు ఎన్నడూ లేని విధంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. మరోసారి పేదలపై ఉన్న ప్రేమను వెల్లడిస్తూ రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేపట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కిందన్నారు.

ప్రజలంతా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో  సత్యనారాయణ,  ఉపేందర్ రెడ్డి, రమేష్, స్వామి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.