24 August, 2026 | 10:20 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

గాంధీభవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వర్గాల ఆరా

23-06-2025 01:11 PM

హైదరాబాద్: గాంధీభవన్ లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వర్గాలు(Congress Factions) ఆరా తీశాయి. పోలీసులు ఉన్నా లారీ లోపలికి రావడంపై కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తులు వస్తే పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నెలకొంది. గాంధీ భవన్ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గొల్ల కుర్మలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గొల్ల కుర్మల సంఘాలు గాంధీ భవన్(Gandhi Bhavan) ముందు గొర్రెలతో ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీ భవన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. యాదవ హక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదవ, గొల్ల, కురుమ వర్గాల శాసనసభ్యులను వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలోకి(State Cabinet) తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.