30 June, 2026 | 2:10 AM

అంత తొందరెందుకు?

30-06-2026 01:07 AM

ఆకాశం విరిగి కింద పడుతుందా?: సుప్రీం కోర్టు 

రామమందిర్ విరాళాల దుర్వినియోగంపై ధర్మాసనం వ్యాఖ్యలు

  1. అత్యవసర విచారణ అవసరం లేదంటూ ‘పిల్’ నిరాకరణ
  2. కోర్టు నిబంధనల ప్రకారమే విచారిస్తామని స్పష్టీకరణ
  3. సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు కోరిన పిటిషనర్లకు భారీ షాక్
  4. కేసు వాదిస్తే రూ.5 లక్షల జరిమానా: ఫైజాబాద్ బార్ అసోసియేషన్
  5. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే ట్రస్ట్ 58 లక్షల రికవరీ.. కేసులో కొత్త ట్విస్ట్

న్యూఢిల్లీ, జూన్ ౨౯: ‘అయోధ్య రామమందిర్ విరాళాల దుర్వినియోగంపై అత్య వసర విచారణ చేపట్టకపోతే మిన్ను విరిగేం కింద పడదు’ అని భారత అత్యున్నత న్యా యస్థానం వ్యాఖ్యానించింది. ‘విచారణకు అంత తొందరెందుకు?’ అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. రామమందిర్ పరిధిలో నిధుల గోల్‌మాల్ విషయమై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నేతృత్వం లో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏ ర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు అడ్వొకేట్లు అజయ్‌కుమార్ రాయ్, దినేష్‌కుమార్ యాదవ్, నరేంద్రకుమార్ గోస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్)ను నిరాకరించింది.

రామ మందిర్ ప్రాంగణం నుంచి డిజిటల్ లాగ్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, సీసీటీవీ ఫుటేజీ వంటి ఆధారాలను సేకరించి భద్రపరచాలని పిటిషన్లు కో రారు. డిజిటల్ సాక్ష్యాలు టాంపరింగ్ కాకుం డా ఫోరెన్సిక్ కాపీలు తీసి సీల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు, దాతల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేందుకు సరైన నియంత్రణ, పర్యవేక్షణ, ఆడిట్ యం త్రాంగాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ పిల్‌పై సోమవారం జస్టిస్ ఎంఎం సుం దరేశ్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్ స్పందించింది. నిధుల దుర్వినియోగంపై అత్యవసర విచారణ అవసరం లేదని, న్యాయస్థానం వేసవి సెలవుల తర్వాత పిల్ ను జాబితాలో చేరేస్తామని, ఆ తర్వాతే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది.

ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే నగదు రికవరీ

అయోధ్య రామమందిర్ విరాళాల చోరీ కేసులో ఓ ట్విస్ట్ వెలుగుచూసింది. నిధుల గోల్‌మాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూ.58 లక్షల మేర నగదు రికవరీ చేయడం గమనార్హం. కేసు దర్యాప్తునకు ముందే నగదు రికవరీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పాత్ర, పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి.

ట్రస్ట్ సభ్యులే స్వయంగా అంతర్గత వి చారణ నిర్వహించి, నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా నుంచి ఈ నగదు రికవరీ చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ నేతృత్వంలోనే సభ్యులు ఈనెల ౭న నిందితుడి ఇంటికి వెళ్లి, బ్యాంక్ లావాదేవీల ద్వా రా నగదు రికవరీ చేసినట్టు నిర్ధారించింది. అయితే.. ట్రస్ట్ రికవరీ చేసిన రూ.౫౮ లక్షల మాట అటుంచితే, ఇక దారి మళ్లిన మిగతా నిధుల సంగతేంటి? అంటూ భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సిట్ దర్యాప్తు వేగవంతం

నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 13న లక్నో డివిజినల్ కమిషనర్ విజయ్‌విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌తో ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు ఆధారంగానే పోలీసులు ఇప్పటివరకు కీలక నిందితు డు అవినాష్‌శుక్లాతో సహా ఎనిమిది మం దిని అరెస్ట్ చేశారు.

క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, క్రిమినల్ కాన్సిరసీ వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు. న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ కస్టడీకి సైతం పంపింది. నగదు నిర్వహణ, ఉద్యోగుల వెరిఫికేషన్, సీసీ టీవీ ఫుటేజీ మానిటరింగ్‌లో లోపాలు ఉన్నట్లు ఇప్పటికే సిట్ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సైతం అందించింది.

నిధుల దుర్వినియోగం అంశం రాజకీయంగానూ దేశవ్యాప్తంగా దుమారం రేపిం ది. అయోధ్యపై ఇంత నిఘా ఉన్నా ఈ అక్రమాలు ఎలా జరిగాయని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా.. రామమందిర్ పరిధిలో రూ. 200 కోట్ల మేర నగదు, 200 కిలోల మేర వెండి దారి మళ్లిందని ఆరోపిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా నిధుల గోల్‌మాల్ వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది. 

కేసు వాదిస్తే రూ.5 లక్షల జరిమానా

మరోవైపు, ఈ కేసులో నిందితుల పక్షాన ఎవరూ వాదించొద్దని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. నిందితుల తరఫు న ఎవరైనా వాదిస్తే, వారిపై క్రమశిక్షణపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రూ.౫ లక్షల మేర జరిమానా కూడా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2005 లోనూ అయోధ మందిరం విషయంలో అక్కడి అడ్వొకేట్లు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మళ్లీ మరోసారి కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నిధుల దుర్వినియోగం ప్రమేయం ఉన్న చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్‌రావు మూడు రోజుల్లో అయోధ్యను విడిచి వెళ్లాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేం ద్ర జైస్వాల్ మాట్లాడుతూ రామాలయ హుండీ విరాళాల దొంగతనం తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పారు. అందుకే నిందితుల తరఫున ఎవ్వరూ వాదించ కూడదని న్యాయవాదులందరూ ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

విరాళాల సొమ్ముతో జల్సాలు

రామమందిర్ విరాళాల నిధుల గోల్‌మాల్ విషయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈకేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ కాగా, వారి లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఆలయ పరిధిలో దాతల విరాళాలు, విలువైన ఆభరణాలను లెక్కించేందుకు పనిలో చేరిన అనుకల్ప్ మిశ్రా, ఆ తర్వాత అక్కడి ఆలయ అధికారులను ప్రాధేయపడి తన బంధువు లవ్‌కుశ్ మిశ్రాను పనిలోకి దించాడు.

అతడితో కలిసి అనుకల్ప్ మిశ్రా సొమ్ము దారి మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిన్నమొన్నటి వరకు సాదాసీదా జీవితం గడిపిన మిశ్రా కుటుంబం, ఇప్పుడు భోగవిలాసాలు అనుభవించడం గమనార్హం. మిశ్రా సొంతంగా ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడాన్ని సిట్ గుర్తించింది. ఊరి చివరన ఓ ఫాంహౌస్ కూడా నిర్మించినట్లు నిర్ధారించింది.

గ్రామంలో ఇటీవల ఏడు రోజులపాటు జాతర జరిగిందని, ఈ జాతరను మిశ్రానే దగ్గరుండి చూసుకున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. మతగురువులను రప్పించి ప్రవచనాలు కూడా చెప్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంతోమంది బిగ్‌షాట్స్ సైతం హాజరైనట్లు చెబుతున్నారు. హాజరైన వారిలో నాటి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఉన్నారంటున్నారు.