calender_icon.png 9 October, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్

09-10-2025 12:40:57 AM

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

యాచారం అక్టోబర్ 8  :  ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ మండల  అధ్యక్షుడు కర్నాటి  రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో  బుధవారం యాచారం మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ ద్వారా ఇంటింటికి తిరిగి  కాంగ్రెస్ బాకీ  కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.6 గ్యారంటీ ల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎ ఒక్కటి అమలు చేయలేదని  స్థానిక ఎన్నికలో ప్రజలు నిలదీయాలని అన్నారు.

22  నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని అని ఆరోపించారు  ముఖ్యంగా మహిళలకు 2500  తులం బంగారం ,వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ ఏమయ్యా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి,  బి ఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ( బంటి) మాజీ జెడ్పిటిసి చిన్నోళ్ల  జంగమ్మ యాదయ్య, వివిధ గ్రామాల అధ్యక్షులు  సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.