calender_icon.png 9 October, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు మంత్రి ఆమోదం

09-10-2025 12:40:30 AM

మంథనిలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజ్ పనులపై మంత్రికి రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి విన్నపం వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు 

మంథని, అక్టోబర్ 8 (విజయ క్రాంతి) : మంథని పట్టణంలోని పలు ప్రధాన  ప్రాంతాలలో సీసీ రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు, మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు  ముస్కుల సురేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.

మంథని పట్టణంలోని శ్రీ అయ్యప్ప దత్తగుడి దేవాలయాల నుండి సి ఆర్ కే కాంప్లెక్స్ మీదుగా తమ్మి చెరువు కట్ట వరకు అలాగే సి ఆర్ కే కాంప్లెక్స్ నుండి ఎరుకల గూడెం హనుమాన్ దేవాలయం వరకు రోడ్డు పూర్తిగా చెడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, అలాగే జనసంచారం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మతుకు డ్రైనేజీల నిర్మాణానికి సహకరించాలని మంత్రిని కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఇందుకు  సంబంధించిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంథని ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించే మంత్రి శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.