13 July, 2026 | 1:59 AM

విధుల్లో ఉండగా గుండెపోటు..

13-07-2026 01:06 AM

లైన్ ఇన్స్‌పెక్టర్ మృతి

బోధన్, జూలై 12 (విజయక్రాంతి): నవీపేట్ మండలం కమలాపూర్ సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్(53) గుండెపోటుతో మృతి చెందినట్లు ఎలక్ట్రికల్ ఏడీ జి. ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.