09-10-2025 12:42:27 AM
మేడ్చల్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ వెంచర్ లో శివాజీ విగ్రహం వద్ద పోలీసులు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఏసీపీ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో వాహనాలు, పరిసరాలను తనిఖీ చేశారు. కేఎల్‌ఆర్ లో దుకాణాలు, హోటల్ ముందు అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా పార్కింగ్ చేయొద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐ కిరణ్, ఎస్త్స్ర శ్రీనివాస్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహం వద్ద రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయడమే గాక రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. జయశంకర్ విగ్రహం వద్ద కూడా ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.