కాంగ్రెస్‌ది దేశ వ్యతిరేక వైఖరి
- ఆర్‌ఎస్‌ఎస్‌పై టార్గెట్ దుర్మార్గం
ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): విదేశీ సంస్థలతో అంటకాగుతూ దేశ వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ చాటుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శిం చారు. దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) అనే సంస్థ ఇచ్చిన నివేదికను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. భారత్‌పై పక్షపాతంగా, ప్రేరేపిత వైఖరితో ఈ నివేదికను అమెరికాకు చెందిన సంస్థ విడుదల చేసిందని ఆయన తెలిపారు. రా వంటి సంస్థ భారత్‌ను ఉగ్రవాడం ముప్పు నుంచి కాపాడేందుకు ఎల్లప్పుడూ దేశ రక్షణ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ సామాజిక సంస్థగా దేశ ఐక్య త, సమగ్రత కోసం పనిచేస్తుందని తెలిపారు.




