calender_icon.png 13 November, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి

13-11-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12(విజయశాంతి):సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు.

చెరువు కట్ట పైకి వెళ్లి, పరిస రాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు. ఇక్కడ అవసరమైన యంత్రాలు, సామగ్రిపై ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు.

నిర్వహణ సక్రమంగా చేపట్టాలి

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించా రు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్ ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

రైతు బజార్ లోనే విక్రయాలు చేయాలి

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్ లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో ఇక్కడే చేసేలా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ ను పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్‌ఓ రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా అధికారులు తదితరులు పాల్గొన్నారు.