calender_icon.png 6 May, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లు

24-04-2025 12:57:49 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ):-అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రా ష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు. బుధవారం మం త్రి, తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో రూ. 1.30 కోట్ల ప్లాన్ నిధులతో గ్రామం కిరువైపుల 1.5 కి.మీ. మేర నిర్మించే సైడ్ డ్రెయిన్ల పనులకు శంఖుస్థాపన, ఏలువారిగూడెం గ్రామంలో రూ. 20 లక్షల ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రా రంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మం త్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగులేకున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలుచేస్తున్నామన్నారు. ఉగాది నుండి దేశంలో ఎక్కడా లేనివిధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొ ప్పున సన్న బియ్యం ఇస్తున్నట్లు, ప్రతి పేదవారు కడుపునిండా భోజనం చేస్తున్నార న్నారు. భూ భారతి- కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు, పైలట్ ప్రాజెక్ట్ గా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న  భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం వచ్చిందని మంత్రి అన్నారు. ధరణి చట్టం తో అభద్రతకు లోనయిన ప్రజలకు భూ భారతి చట్టంతో భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ప్రభు త్వం అండగా నిలుస్తుందని మంత్రి అన్నారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యుగంధర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపిడివో సిలార్ సాహెబ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.