22 March, 2026 | 3:37 AM

బీసీలకు మరోసారి కాంగ్రెస్ అన్యాయం

22-03-2026 12:00 AM

బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం

బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ కె.మురళీ మనోహార్

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో 56 శాతం ఉన్న బీసీలకి 3.8 శాతం నిధులను కేటాయించి బలహీనవర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి మోసం చేసింద ని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మ న్ ప్రొఫెసర్ కె. మురళీ మనోహర్ విమర్శించారు.  రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకి తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా ఏకశిలా పార్కు నుంచి అమరవీరుల స్తూపం వరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీని ఉద్దేశించి మురళీ మనోహర్ మాట్లాడారు.

2026-  ఆర్థిక సంవత్సరానికి  రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేవలం 12,511 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించి ప్రభుత్వం బీసీలకి అన్యాయం చేసిం దన్నారు. .గత మూడు బడ్జెట్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించటం లేదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఎం. సా రంగపాణి, ప్రొఫెసర్ వడ్డే. రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించడమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదన్నారు.

గత బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 11,405 కోట్ల రూపాయలను కేటాయించి 3000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదన్నా రు.  బీసీ నాయకులు బుట్టి శ్యామ్ యాదవ్, ఎదునూరి రాజ మొగిలి, చందా మల్లయ్య మాట్లాడుతూ బడ్జెట్‌లో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకి వివిధ కుల సమాఖ్య ఫెడరేషన్లకి కేటాయిస్తున్న నిధుల్లో కూడా ఒక్క రూపా యి ఖర్చు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి అన్యాయం చేస్తుందన్నారు.బడ్జెట్ నిధుల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే వైఖరి అనుసరిస్తే భవిష్యత్తులో రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాలన్నారు.

బీసీ నేతలు డాక్టర్ తిరునహరి శేషు దారబోయిన సతీష్, ప్రొఫెసర్. బెనర్జీ, ప్రొఫెసర్ గోపు.సుధాకర్ తాడిశెట్టి క్రాంతి, గొల్లపల్లి వీరస్వామి వీసీకే నాయకులు జిలకర శ్రీనివాస్, టీఆర్పీ నాయకులు పల్లెబోయిన అశోక్, జిల్లా అధ్యక్షులు సంపత్ పటేల్,దార జనార్దన్ గౌడ్, రాజు, చిన్నాల యశ్వంత్ యాదవ్, డేనియ ల్, వినయ్‌చారి, డాక్టర్ కొంగ వీర స్వామి, డాక్టర్ కూరపాటి రమేష్, డాక్టర్ కొంతం కృష్ణ, డాక్టర్ బ్రహ్మయ్య, డాక్టర్ తండు నాగయ్య, డాక్టర్ రమేష్, దాడబోయిన శ్రీనివాస్, పులి శ్రీనివాస్, మల్లే ష్,ధర్మపురి రామారావు పటేల్, చుంచు సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం బడ్జెట్ ప్రతులను బీసీ నేతలు దహనం చేశారు.