18 July, 2026 | 10:17 AM

కాంగ్రెస్ నేత దిగంబర్‌రావు మృతి

27-10-2024 12:01 AM

భైంసా, అక్టోబర్ 26: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు, భైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్‌రావు మహాశెట్టివార్ (95) శనివారం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జుపటేల్, పవార్ రామారావుపటేల్ తదితరులు సంతాపం తెలిపారు.