18 July, 2026 | 10:33 AM

కరెంట్ షాక్‌తో మహిళ దుర్మరణం

27-10-2024 12:02 AM

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 26 ( విజయక్రాంతి): తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం నుంచి తెగిపడిన విద్యుత్ వైరు తగిలి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా దేశిటిక్యాలలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ (32) పొలం పనులకు వెళ్దామని తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మహిళ అప్పటికే తెగిపడి ఉన్న కరెంట్ తీగనను గమనించక తగలడంతో షాక్‌కు గురై అక్కడకక్కడే ప్రాణం వదిలింది.

తుప్పు పట్టిన స్థంభం, తీగలను మార్చాలని స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. విద్యుత్ సరఫరా అవుతూ వేలాడుతున్న పట్టించుకోకపోవడం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని మండిపడ్డారు. భాగ్యమ్మకు భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.