31 May, 2026 | 9:22 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

జుక్కల్ ఎమ్మెల్యేకు సన్మానం

08-04-2026 12:45 AM

నిజాంసాగర్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): కేరళ రాష్ట్రంలోని అడూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ పరిశీలకులుగా పర్యటించి తిరిగి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంగళవారం నాడు జుక్కల్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అడూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమీక్షించి విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకున్న తోట లక్ష్మీకాంతరావు, తిరిగి నియోజకవర్గానికి  చేరుకోవడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని, మారు పూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యునికి  ఏఐసీసీ పరిశీలకునిగా నియమించడం  ఆయన పనితీరుకు నిదర్శనం అన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు