25 July, 2026 | 11:07 AM

హైదరాబాద్‌లో జోరు వాన

27-06-2024 04:33 PM

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం జోరుగా వాన కురుస్తోంది. పొద్దంతా ఎండ కొట్టిన ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, బోరబండ, ఫిలింనగర్, మహిదీపట్నం,టోలీచౌకి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ మియాపూర్,కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.  లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది.  లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, మంచిర్యాలు, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ సహా పలు జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.