లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
01-07-2024 12:26 PM
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: నీట్ చర్చకు ఒక రోజు కేటాయించాలని రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్ ఓఎం బిర్లాను కోరారు. స్పీకర్ అనుమతించకపోవడంతో లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాహుల్ గాంధీ మైక్ ఆగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు మైక్ ఆగిపోవడంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. మైక్ నిర్వహణ సభాపతి స్థానంలో ఉన్నవారి చేతిలో ఉండదని స్పీకర్ చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ కూడా సభాపతి స్థానంలో కొన్ని సార్లు ఉన్నారని ఓం బిర్లా తెలిపారు. మైక్ పనితీరు స్పీకర్ చేతిలో ఉంటుందని సురేష్ చెబితే నమ్ముతానని స్వీకర్ అన్నారు. స్పీకర్ వివరణతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన విరమించారు.






